Monday, 12 May 2025

Graha Samayamu

దశ / గోచార దశ లో గ్రహ ఫలితాలు గమనించవచ్చు Jyotisharnava navaneetham/saravali సూత్రం --1 మేషం నుండి లగ్నం వరకు , మేషము నుండి గ్రహ (దశ అధిపతి) స్థానం వరకు లెక్కించి , ఈ రెండు సంఖ్యలను గుణించి, దశ అధిపతి సంవత్సరపు సంఖ్యా తో గుణించాలి వచ్చిన మొత్తమును 27 తో భాగించాలి , వచ్చిన శేషం గ్రహ సమయం అవుతుంది, శేషము శూన్యమైతే 27 ను తీసుకోవాలి Count number of houses from mesha to lagna, count number of houses from mesha to planet of which the dasa is running, then multiply these two with planet vimsottari dasa years , then divide by 27, note the remainder . of remainder is zero take it as 27. సూత్రం ---2 గ్రహ సమయం సంఖ్యను ( శేషం పైన ) మరల దశ అధిపతి సంవత్సరపు సంఖ్యా తో గుణించి 6 తో భాగించిన వచ్చిన శేషము - సమయ అవస్థ అవుతుంది , శేషము శూన్యమైతే 6 ను తీసుకోవాలి Graha samaya remainder to be multiplied by planet vimsottari dasa years then divided by 6 to get graha samaya avastha. If remainder is zero, take it as 6. 1.స్నాన సమయం (ధైర్యము) a.మృతికశౌచం , b.దంత దావనం, c.ముఖపక్షాలనం, d.చన్నీటిస్నానం ,e.వేడినీటి స్నానం, /f.అభ్యంగన స్నానం 2 వస్త్రధారణ సమయం (అధికారము) a.వస్త్ర నయనం,b. వస్త్ర గ్రహణం ,c.ఉత్తరేణి ధారణం, d.వస్త్రచ్ఛాదనం , e.పాదప్రక్షాళనం, f.ఆచమనం 3.తిలక సమయం (క్షేమము) a.ఆనయనం,b. గ్రహణం, ధారణం , c.దర్పణ విక్షణం ,d.ఆమోదం ,e.దర్పణ f.విసర్జనం 4.జప సమయం(శత్రు జయము) a.భూశోధనం,b.ఆసనానయనం,c.ఆసీనత్వం, d. ప్రాణాయామం, e.అంగన్యాసం, f.మూలమంత్రం, 5. శివ పూజా సమయం (శత్రు జయము, సౌఖ్యము) a.మృతిక నయనం ,b.లింగ కరణం, c.ఆవాహనం, d.పూజానం , e.ప్రదక్షిణం ,f.విసర్జనం 6. హోమ సమయం(దుఃఖ ప్రాప్తి) a.ఆగ్నాయనం, b.అగ్ని ఆహ్వానం, c.ఆజ్యాహుతి, d.పరిషేచనం e.స్తోత్రం,f.విసర్జనం 7. విష్ణు పూజా సమయం(దిగ్విజయము) a.పాత్రశోధనం,b.అభిషేకచనం,c.ఆర్గ్యపాధ్యాచనం, d.అర్చనం, e.నైవేద్యం,f.స్తోత్రము 8. ద్విజార్చనం(రాజ్య ప్రాప్తి) a. ఆనయనం, b.పాదప్రక్షాళనం, c.గంధపుష్పాధ్యాలంకరం ,d.అర్చనం, e. ప్రదక్షిణం, f.నమస్కారం 9. నమస్కార సమయం(శుభ ప్రదం) a.ఊర్ధ్వము, b.పూర్వము, c.దక్షిణము,d.పశ్చిమము,e.ఉత్తరము, f.ఉపచారము 10. అద్రి ప్రదక్షిణ సమయము(లాభం) a.ఉద్యుక్తము, b.నిర్గమనము, c.మధ్య ప్రవాసము, d.గిరిప్రవేశము, e.సేవనము, f.అధిష్టానము 11. వైస్వ దేవ సమయము(మంగళ ప్రదం) a. అగ్న్యానాయనము, b.భూమ్యాలంకారము, c.హవిష్య నయనము, d.ఆజ్య స్పర్శము, e.పానీయము, f.ఉపస్థానము 12. అతిథి పూజా సమయము(బోగభాగ్యాలు) a.దర్శనము, b.శూన్యము, c.స్థితి, d.వందనము, e.అన్నదానము, f.స్వస్థానము 13. భోజన సమయము(భోగ ప్రాప్తి) a.శుద్దన్నము, b.సూప భోజనము,c.పాయస భోజనము, d.ఇష్టాన్న భోజనము,e.బందు సహిత భోజనము, f.పుత్రమిత్ర సహిత భోజనము 14. విద్యా సమయము(పాండిత్యం) a.విధ్వజ్జన సల్లాపము, b.విద్యా ప్రసంగము ,c.వేదాంత శ్రవణము, d.పురాణ శ్రవణము, e.వివాదన ,f.విప్రపూజ 15. ఆ క్రోశ సమయము(వ్యసనం) a.భృత్య కోపము, b.ప్రయాణ కోపము, c.కోప ప్రసాదము, d. క్షిప్ర కోపము, e.కోపఘూతము, f.కోపము 16. తాంబూల సమయము(స్త్రీ సౌఖ్యం) a.ఆనయనము,b.నిధానము, c.గ్రహణము, d.భుక్తము,e.ఉల్లాసము,f.హాసము 17. రాజ విలాస స్థితి సమయము(జయం) a. పురాగమనము, b.దూతి ప్రేరణ, c.మంత్రి జనాగమనము , d.ఏకాకిత్వము,e.మంత్రులతో ఆలోచన , f.చిత్ర చామరాది విహారము 18. సభా స్థితి సమయము(వాహన సౌఖ్యం) a.రధ రోహణము, b.గజానయనము, c.అశ్వ నాయనము, d.గజారోహణము, e.అశ్వరోహణము. f.దేవతా సల్లాపము 19. జలపాన సమయము(సౌఖ్యం) a. మంత్రులకు జల దానము, b.సర్వజన దానము c.తాళవృంతానయనం, d.సేవనము ,e.సమంతా జలసేచనము, f.జల విసర్జనము 20. ఆలస్య సమయము(దుఃఖం , భయం) a.హస్త ప్రధానము, b.ఆసీనత్వము, c.శిఖా మర్దనము,d.కంట మర్దనము, e.స్తంభనము,f.తన్ని వారణము 21 శయన సమయము(శోభాగ్య విహీనం) a. శయ్యసనం, b.శయ్యా సూత్రధారణము,c.శయ్య పరికరణ,d.శయ్య పరిసూత్రధారణము, e.శయ్య పరి పరిసరనము, f.శయనోల్లసము 22. అమృత బక్షణ సమయము(తృప్తి, ఆరోగ్యం) a.అమృతశోధనము, b.స్వపరిజన అమృత దానము, c.ప్రాశనము,d.అత్యంత మనోళ్లాసము, e.అఖిల భూమి విహారము, f.అశ్వగజామృత ధానము 23. గందలేపన సమయము(అధికారం ,సంతానం) a.గంధాలంకారము, b.పుష్పాలంకారము, c.కస్తూరి తిలక ధారణము, d.ఆభరణాలంకారము ,e.కిరీట ధారణము, f.కిరీట విసర్జనము 24. సల్లాప సమయము(భోగ భాగ్యలు) a.గృహ సల్లాపము, b.శృంగారము, c.ఆలింగనము,d.హాస్యము,e.బుజగము, f.గీతము 25. భోగ సమయము(కుటుంభ వృద్ధి) a.భోగము, b.భోగ్యము, c.ఉపరతి, d.భాదనము, e.స్థలనము, f.ఉచ్చశినము 26. నిద్ర సమయము(భోగ విహీనం) a.నిద్ర, b.ఉన్మీలనము, c.గాడ నిద్ర ,d.ఉత్కృష్ట నిద్ర, e.స్వప్న నిద్ర, f.ఉన్మీల దర్శనము 27. రత్న పరీక్షా సమయము(ధన ప్రాప్తి) a.అశ్వ పరీక్ష, b.గజపరీక్ష ,c.రత్న పరీక్ష ,d.వీణా ప్రసంగము, e.ఉభయ చామర ప్రాప్తి , f.ఉభయ చత్ర విసర్జనము
సూర్య గ్రహ సమయం చూడాలనుంటే మేషం నుండి జన్మ లగ్నం = 10 (మకరం) మేషం నుండి సూర్య గ్రహమున్న రాశి వరకు =1 సూర్య దశ సంవత్సరము (వింశోత్తరి దశ) = 6 గ్రహ సమయము = 10 X 1 X 6 =60 / 27 = శేషం 6 (హోమ సమయము ). అవస్థ = పైన వచ్చిన శేషం(6 ) X గ్రహ దశ సంవత్సరము (6 ) =36 ను 6 చే భాగించండి ( గ్రహ సమయము 6 భాగాలు గా విభజన జరిగింది ). 36 /6 = శేషం శూన్యం (0 ) , శూన్యం అయినప్పుడు 6 గా తీసుకోవాలి . చంద్ర గ్రహ సమయం = 10 (లగ్నం) X చంద్ర గ్రహ రాశి(5 ) X 10 ( వింశోత్తరి సంవత్సరము) = 500 /27 = శేషము 14 ( విద్య సమయము ) గ్రహ అవస్థ = 14 X 10 /6 = శేషము =2 (విద్య ప్రసంగము) కుజ గ్రహ సమయం = 15 ఆక్రోశం , గ్రహ అవస్థ =3 కోప ప్రసాదం బుధ గ్రహ సమయం = 15 ఆక్రోశం , గ్రహ అవస్థ =3 కోప ప్రసాదం గురు గ్రహ సమయం= 19 జలపాన సమయం, గ్రహ అవస్థ =4 సేవనం శుక్ర గ్రహ సమయం = 22 అమృత బక్షణ సమయము, గ్రహ అవస్థ =2 స్వపరిజన అమృత దానము శని గ్రహ సమయము = 12 అతిథి పూజా సమయము , గ్రహ అవస్థ =6 స్వస్థానము రాహు గ్రహ సమయము = 18 సభా స్థితి సమయము , గ్రహ అవస్థ =6 దేవత సల్లాపము కేతు గ్రహ సమయము =4 జప సమయము, గ్రహ అవస్థ =4 ప్రాణాయామం

No comments:

Post a Comment