Monday, 12 May 2025

Lord Sri Rama Horoscope

Lord Sri RamaChandra born on Chaitra Sukhla Navami @12 noon in Punarvasu Nakshatra. శ్రీరామ రామ రామేతి , రమే రామే మనోరమే; సహస్ర నామ తతుల్యం, రామ నామ వరాననే.
కర్కాటక లగ్నం , లగ్నం లో గురు ఉచ్ఛం , చంద్ర స్వక్షేత్రం , చంద్రుడు లగ్నం లో ఉంటే జాతకుడు లోకులు ఏమనుకుంటారో అనే భావన ఉంటుంది . సంఘము లో నైతిక విలువలు పాటిస్తారు ( గురు చంద్ర యుతి ).గజ కేసరి యోగం , సప్తమం లో కుజ , కుజుడి పై గురు దృష్టి వలన జాతకుడు యుద్ధం లో నైతిక విలువలు పాటిస్తాడు. శని, శుక్ర, గురు, కుజ ఉచ్చము. ద్వితీయాధిపతి సూర్య(మారకుడు) నవమ భావం(మీనము) లో వున్నాడు,సూర్యుని పై గురు దృష్టి . మీనము జల రాశి , అవతార సమాప్తి సరయు నది లో అయినది . కుజుడు పంచమ మరియు దశమాధిపతి , యోగ కారకుడు సప్తమ భావం లో వున్నాడు .కుజ గురు పరస్పర దృష్టి వలన రాజ లక్షణ యోగం . చతుర్ధ భావ అధిపతి శుక్రుడు నవమ భావం లో సూర్య యుతి లో వున్నాడు . జాతకుని తండ్రి గృహం గొప్పగా ఉంటుంది . ద్వాదశ భావ అధిపతి బుధుడు దశమ లో వుండి చతుర్ధ భావం పై దృష్టి . వనవాసము /విదేశం ( 12 భావము). శని చతుర్థి భావం లో ఉండడం వలన జాతకుడు ఇల్లు విడిచి పోతాడు . సప్తమ భావ అధిపతి శని ( భార్య ) చతుర్ధం లో . ద్వాదశ భావ అధిపతి బుధుడు దశమ లో వుండి చతుర్ధ భావం పై దృష్టి వలన వివాహ అనంతరం భార్య తో కలసి వనవాసము/భార్య వియోగము . పంచమాధిపతి కుజుడు సప్తమం లో ఉచ్చము . లగ్నము పై దృష్టి . పంచమ భావం- శిష్యుడు/దాసుడు , ఆంజనేయ స్వామి చాల బలవంతుడు .సీత రాములను కలిపింది ఆంజనేయ స్వామి . గురు కుజ ( రెండు ఉచ్చేమే )పరస్పర దృష్టి లగ్న సప్తమం లో అయినందువలన శ్రీ రాముడు మర్యాద పురుషోత్తముడు .(గురు కుజ లగ్నం సప్తమ భావం లో ఉంటే మానసిక వ్యాధులు ) నవమాధిపతి గురు ని శని మరియు కుజ దృష్టి వలన తండ్రి ఆయుర్ధాయము తగ్గుతుంది. పితృ కారకుడైన సూర్యుడు నవమం లో ఉంటే తండ్రి కుమారుని అభివృద్ధి చూడకుండానే జీవితం ముగుస్తుంది . చంద్రుని పై కుజ శని దృష్టి వలన సన్యాసి యోగం . రాహు ధను రాశి ఉండడం వాళ్ళ శ్రీరామునికి కోదండ రాముడిని పేరు . రాహు శత్రు స్థానం లో బ్రాహ్మణ రాశి ధను లో వున్నాడు. రావణుడు రాక్షసుడు , నీతి తప్పిన బ్రాహ్మణుడు పంచమాధిపతి కుజ షష్టాది పతి గురు పరస్పర దృష్టి వలన జాతకునికి తనయులతో యుద్ధము. కేతు ద్వాదశము లో వుండి మోక్షము సూచిస్తున్నాడు . గురు చంద్రులను శని కుజ వీక్షణం వలన శ్రీ రామ చంద్రుడు జీవితాంతం కష్టాలని చవి చూసాడు. ద్వాదశాధిపతి సప్తమము ను వీక్షించడంవలన భార్య అపహరణ కు గురవుతుంది . శ్రీ రాముడు అభిజీత్ ముహూర్తం లో పునర్వసు(గురు ) నక్షత్రం లో జన్మించాడు.లక్ష్మణుడు ఆశ్లేష (బుధ) నక్షత్రం లో జన్మించాడు

No comments:

Post a Comment