Tuesday, 17 July 2018

Nakshatra Gayatri in Telugu


ఏ నక్షత్రం వారు ఆ నక్షత్ర గాయత్రి ని రోజుకు 9 సార్లు పఠించాలి
ఈ విధంగా చేయడం వల్ల శుభ ఫలితాలు చేకూరుతాయి
1.
అశ్విని
ఓం శ్వేతవర్ణై విద్మహే సుధాకరాయై ధిమహి తన్నో అశ్వినేన ప్రచోదయాత్

2.భరణి
ఓం కృష్ణవర్ణై విద్మహే దండధరాయై ధిమహి తన్నో భరణి:ప్రచోదయాత్

3.కృత్తికా
ఓం వణ్ణిదేహాయై విద్మహే మహాతపాయై ధీమహి తన్నో కృత్తికా ప్రచోదయాత్

4.రోహిణి
ప్రజావిరుధ్ధై చ విద్మహే విశ్వరూపాయై ధీమహి తన్నో రోహిణి ప్రచోదయాత్

5.మృగశిరా
ఓం శశిశేఖరాయ విద్మహే మహారాజాయ ధిమహి తన్నో మృగశిర:ప్రచోదయాత్

6.ఆర్ద్రా
ఓం మహాశ్రేష్ఠాయ విద్మహే పశుం తనాయ ధిమహి తన్నో ఆర్ద్రా:ప్రచోదయాత్

7.పునర్వసు
ఓం ప్రజా వరుధ్ధై చ విద్మహే అదితి పుత్రాయ ధిమహి తన్నో పునర్వసు ప్రచోదయాత్

8.పుష్య
ఓం బ్రహ్మవర్చసాయ విద్మహే మహాదిశాయాయ ధిమహి తన్నో పుష్య:ప్రచోదయాత్

9.ఆశ్లేష
ఓం సర్పరాజాయ విద్మహే మహారోచకాయ ధిమహి తన్నో ఆశ్లేష: ప్రచోదయాత్

10.మఖ
ఓం మహా అనగాయ విద్మహే పిత్రియాదేవాయ ధిమహి తన్నో మఖ: ప్రచోదయాత్

11.పుబ్బ
ఓం అరియంనాయ విద్మహే పశుదేహాయ ధిమహి తన్నో పూర్వఫల్గుణి ప్రచోదయాత్

12.ఉత్తరా
మహాబకాయై విద్మహే మహాశ్రేష్ఠాయై ధీమహి తన్నో ఉత్తర ఫల్గుణి ప్రచోదయాత్

13.హస్త
ఓం ప్రయచ్చతాయై విద్మహే ప్రకృప్రణీతాయై ధీమహి తన్నో హస్తా ప్రచోదయాత్

14.చిత్తా
ఓం మహాదృష్టాయై విద్మహే ప్రజారపాయై ధీమహి తన్నో చైత్రా:ప్రచోదయాత్

15.స్వాతి
ఓం కామసారాయై విద్మహే మహాని ష్ఠాయై ధీమహితన్నో స్వాతి ప్రచోదయాత్

16.విశాఖ
ఓం ఇంద్రాగ్నేస్యై విద్మహే మహాశ్రేష్ఠాయై చ ధీమహీ తన్నో విశాఖ ప్రచోదయాత్

17 అనూరాధ
ఓం మిత్రదేయాయై విద్మహే మహామిత్రాయ ధీమహి తన్నో అనూరాధా ప్రచోదయాత్

18.జ్యేష్ఠా
ఓం జ్యేష్ఠాయై విద్మహే మహాజ్యేష్ఠాయై ధీమహి తన్నో జ్యేష్ఠా ప్రచోదయాత్

19.మూల
ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై వి ఓం ప్రజాధిపాయై విద్మహే మహాప్రజాధిపాయై ధీమహి తన్నో మూలా ప్రచోదయాత్

20.పూర్వాషాఢ
ఓం సముద్ర కామాయై విద్మహే మహాబీజితాయై ధిమహితన్నో పూర్వాషాఢా ప్రచోదయాత్

21.ఉత్తరాషాఢ
ఓం విశ్వేదేవాయ విద్మహే మహాషాఢాయ ధిమహి తన్నో ఉత్తరాషాఢా ప్రచోదయాత్

22. శ్రవణ
ఓం మహాశ్రేష్ఠాయై విద్మహే పుణ్యశ్లోకాయ ధీమహి తన్నో శ్రవణ ప్రచోదయాత్

23.ధనిష్ఠా
ఓం అగ్రనాథాయ విద్మహే వసూప్రితాయ ధీమహి తన్నో శర్విష్ఠా ప్రచోదయాత్

24.శతభిషం
ఓం భేషజాయ విద్మహే వరుణదేహాయ ధీమహి తన్నో శతభిషా ప్రచోదయాత్

25.పూర్వాభాద్ర
ఓం తేజస్కరాయ విద్మహే అజరక పాదాయ ధీమహి తన్నో పూర్వప్రోష్టపత ప్రచోదయాత్

26.ఉత్తరాభాద్ర
ఓం అహిరబుధ్నాయ విద్మహే ప్రతిష్ఠాపనాయ ధీమహి తన్నో ఉత్తరప్రోష్టపత ప్రచోదయాత్

27.రేవతి
ఓం విశ్వరూపాయ విద్మహే పూష్ణ దేహాయ ధీమహి తన్నో రేవతి ప్రచోదయాత్

 

Nakshatra Shivalayalu


నక్షత్ర శివాలయములు. 108 శివాలయాలు.

ద్రాక్షారామ చుట్టుపక్కల అనేక శివాలయాలు దేవీమందిరాలు ఉన్నాయని అందరికి తెలిసిన విషయమే.
ఆ ఆలయాలన్నిటిని ఆకాశమార్గాన చూస్తే అన్ని కలిపి ఒక పద్మాకారం లో వుంటాయి. ఈ ఆలయాల గురించి బహుళ ప్రాచుర్యం లేనందున చాల మందికి ఈ ఆలయాల గురించిన అవగాహన లేదు.
విశేషమేమిటంటే, ప్రతి వ్యక్తి 27 నక్షత్రాలు లో ఉన్న 108 పాదాలలో ఏదో ఒక దానిలో జన్మిస్తారు. ప్రతి నక్షత్రానికి దానికి సంబంధించిన ప్రతి పాదానికి సంబంధించి ప్రత్యేకమైన ఆలయం ఉంటుంది
గ్రహదోష నివారణ కోసం అభిషేకాలు చేయ దలుచుకున్న వారికి ఆ ప్రత్యేకమైన ఆలయంలో మొదట నామ నక్షత్రము, లేదా జన్మనక్షత్రానికి తరువాత రాశికి సంబంధించిన లింగ ఆరాధన చేసి చివరకు ద్రాక్షారామం దర్శించుకుంటే ఫలితం ఉంటుందట .
మేషరాశి నుండి మీనరాశి వరకు అదే క్రమంలో ఆరాధించ వలసిన ఆలయాల సమాచారం.
మేష రాశి
మేషరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామం భీమేశ్వర స్వామి వారి ఆలయానికి తూర్పున విలాసగంగావరంలో వుంది.
అశ్విని నక్షత్రం
పాదం ----------స్థలం -------- దేవీ దేవతల నామాలు
మొదటి---------బ్రహ్మపురి-------శ్రీశ్రీశ్రీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి
రెండవ ------- - ఉట్రుమిల్లి -------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భీమశంకర స్వామి
మూడవ------ కుయ్యూరు శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ దుగ్గుదూరు శ్రీశ్రీశ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
భరణి నక్షత్రం
మొదటి------కోలంక---------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------ఎంజారం-------శ్రీ ఉమా సమేత కృపేశ్వర స్వామి
మూడవ------పల్లిపాలెం------శ్రీ గంగా పార్వతీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------ఉప్పంగళ-------శ్రీ పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామి
కృత్తికా నక్షత్రం
మొదటి-------నేలపల్లి---------శ్రీ మీనాక్షి దేవి సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి.
వృషభ రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి తూర్పున వృషభ రాశికి సంబంధించిన ఆలయం విలాసగంగావరం లో ఉన్నది.
కృత్తికా నక్షత్రం
రెండవ------అదంపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మూడవ-----వట్రపూడి------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-----ఉండూరు------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేయ స్వామి
రోహిణీ
మొదటి-----తనుమల్ల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
రెండవ-------కాజులూరు-------శ్రీ అన్నపూర్ణేశ్వరీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------ఐతపూడి--------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ ----- చీల ---------శ్రీ ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మృగశిర
మొదటి--------తాళ్ళరేవు------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి.
రెండవ---------గురజానపల్లి------శ్రీ ఓం శ్రీ సర్వమంగళ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
మిధున రాశి.
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఈశాన్యమున మిధున రాశికి సంబంధించిన ఆలయం హసనాబాద్ లో ఉన్నది.
మృగశిర
మూడవ-------- అంద్రగ్గి-------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ--------జగన్నాధగిరి------ శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి
ఆరుద్ర
మొదటి-------పనుమళ్ళ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------గొల్లపాలెం------శ్రీ పార్వతీ సమేత గోకర్ణేశ్వర స్వామి
మూడవ----వేములవాడ-----శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామి
నాలుగవ------కూరాడ----------శ్రీ భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి
పునర్వసు
మొదటి-------గొర్రిపూడి (భీమలింగపాడు)----శ్రీ పార్వతీ సమేత శ్రీ భీమేశ్వర స్వామి
రెండవ--------కరప----------శ్రీ పార్వతవర్ధి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ------ఆరట్లకట్ల------ శ్రీ భ్రమరాంబా సమేత శ్రీ మల్లీశ్వర స్వామి
కర్కాటక రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున కర్కాటక రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.
పునర్వసు
నాలుగవ------యెనమాడల--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
పుష్యమి
మొదటి--------కాపవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ---------సిరిపురం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
మూడవ-------వేలంగి----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
నాలుగవ--------ఓడూరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ భవానీ శంకర స్వామి
ఆశ్లేష
మొదటి-------- దోమాడ--------శ్రీ ఉమా సమేత శ్రీ మార్కండేశ్వర స్వామి
రెండవ---------పెదపూడి-------శ్రీ శ్యామలాంబా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------గండ్రాడు--------శ్రీ ఉమా సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------మామిడాడ-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీశ్రీ భీమేశ్వర స్వామి
సింహ రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి ఉత్తరమున సింహ రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఇక్కడి ఆలయం వెల్ల లో శ్రీ ఉత్తర సోమేశ్వర స్వామి వారికి అంకితం.
మఖ నక్షత్రం
మొదటి------నరసరావుపేట------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
రెండవ--------మెల్లూరు------------శ్రీ విశాలాక్షీ సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
మూడవ------అరికిరేవుల----------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
నాలుగవ------కొత్తూరు------------శ్రీ పార్వతీ సమేత శ్రీ నాగలింగేశ్వర స్వామి
పుబ్బ నక్షత్రం
మొదటి--------చింతపల్లి---------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
రెండవ---------వెదురుపాక------శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి
మూడవ--------తొస్సిపూడి-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ గోరేశ్వర స్వామి
నాలుగవ--------పొలమూరు-----ఉమా సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
ఉత్తర నక్షత్రం
మొదటి----------పందలపాక--------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
కన్యా రాశి
ద్రాక్షారామం లోని భీమేశ్వర స్వామి ఆలయానికి వాయవ్యమున కన్యా రాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం యూరుపల్లిలోని శ్రీ రాజరాజేశ్వరీ సమేత నీలకంఠేశ్వర స్వామి వారికి అంకితం చేయబడ్డది.
ఉత్తర నక్షత్రం
రెండవ---------చోడవరం---------శ్రీ పార్వతీ సమేత శ్రీ అగస్త్తేశ్వర స్వామి
మూడవ-----నదురుబాడు--------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ------పసలపూడి---------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ రాజరాజేశ్వరుడు
హస్త
మొదటి------సోమేశ్వరం--------శ్రీ బాలాత్రిపుర సుందరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ-------పడపర్తి------------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వరుడు
మూడవ------పులగుర్త-----------శ్రీ పార్వతీసమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------మాచవరం-------శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
చిత్త నక్షత్రం
మొదటి-------కొప్పవరం--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
రెండవ--------అర్థమూరు-------శ్రీ పార్వతీ సమేతశ్రీ అగస్తేశ్వర స్వామి
తుల రాశి
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో తులారాశికి సంబంధించిన ఆలయం ఉన్నది.
చిత్త నక్షత్రం
మూడవ-------చల్లూరు------------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ-------కాలేరు--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
స్వాతి నక్షత్రం
మొదటి--------మారేడుబాక---శ్రీ పార్వతీ సమేత మల్లేశ్వర స్వామి
రెండవ---------మండపేట------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర కైలాసేశ్వర స్వామి
మూడవ-------గుమ్మిలూరు----శ్రీ ఉమాసమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
నాలుగవ------వెంటూరు-------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
విశాఖ నక్షత్రం
మొదటి-----దూళ్ళ-------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ------నర్సిపూడి----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
మూడవ-----నవాబుపేట----శ్రీ పార్వతీ సమేత సోమేశ్వరస్వామి
వృశ్చిక రాశి
ద్రాక్షారామానికి పడమరగా వున్న ఆదివారపుపేట లో వృశ్చికరాశికి సంబంధించిన ఆలయం ఉన్నది. ఈ ఆలయం శ్రీ పార్వతీ సమేత పరమేశ్వరునికి అంకితం.
విశాఖ నక్షత్రం
నాలుగవ-------కూర్మపురం------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
అనూరాధా నక్షత్రం
మొదటి------పనికేరు--------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ ఇష్టకాంతేశ్వర స్వామి
రెండవ-------చింతలూరు-----శ్రీ పార్వతీ సమేత శ్రీ పృధ్వీశ్వర స్వామి
మూడవ-----పినపల్ల---------శ్రీ పార్వతీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
నాలుగవ-----పెదపల్ల-------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
జ్యేష్టా నక్షత్రం
మొదటి------వడ్లమూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
రెండవ--------నల్లూరు---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ------వెదురుమూడి---శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లేశ్వర స్వామి
నాలుగవ----- తేకి--------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వరస్వామి
ధనుస్సు రాశి
ధనుస్సు రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి నైఋతి లోఉన్నది. నేలపర్తిపాడులోని శ్రీ అన్నపూర్నాసమేత కాశివిశ్వేశ్వర స్వామికి అంకితం
మూల నక్షత్రం
మొదటి---------యెండగండి-------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ----------పామర్రు-----------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ--------అముజూరు--------శ్రీ ఉమాపార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ--------పానంగిపల్లి--------శ్రీ లలితాంబికా సమేత శ్రీ ఉత్తరేశ్వర స్వామి
పూర్వాషాఢ
మొదటి---------అంగర-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ కనకలింగేశ్వర స్వామి
రెండవ---------కోరుమిళ్ళ--------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
మూడవ-------కుళ్ళ-------------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------వాకతిప్ప--------శ్రీ ఉమాసమేత రామలింగేశ్వర స్వామి
ఉత్తరాషాఢ
మొదటి-------తాతపూడి---------శ్రీ పార్వతీసమేత శ్రీ మల్లేశ్వర స్వామి
మకర రాశి
మకర రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.
ఉత్తరాషాడ నక్షత్రం
రెండవ---------మచర--------శ్రీ పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి
మూడవ-------సత్యవాడ------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
నాలుగవ-------సుందరపల్లి----శ్రీ ఉమాసమేత శ్రీ సోమేశ్వర స్వామి
శ్రవణ నక్షత్రం
మొదటి-------వానపల్లి-------శ్రీ ఉమాసమేత శ్రీ వైద్యనాధీశ్వర స్వామి
రెండవ--------మాదిపల్లి (మాడుపల్లి)--- శ్రీ పార్వతీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
మూడవ------వాడపాలెం-------శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ వీరేశ్వర స్వామి
నాలుగవ------ వీరపల్లిపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరేశ్వర స్వామి
ధనిష్ట
మొదటి--------వెల్వలపల్లి-------శ్రీ మహిషాసురమర్ధనీ సమేత శ్రీ రాజరాజనరేంద్ర స్వామి
రెండవ---------అయినవెల్లి-------శ్రీ అన్నపూర్ణా సమేత శ్రీ విశ్వేశ్వర స్వామి
కుంభ రాశి
కుంభ రాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం లోఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈ ఆలయం.
ధనిష్ట
మూడవ-------మసకపల్లి------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
నాలుగవ-------కుందూరు------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
శతభష
మొదటి--------కోటిపల్లి---------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ--------కోటిపల్లి-------- శ్రీ పార్వతీ సమేత శ్రీ కోటేశ్వర స్వామి
మూడవ------తొట్టరమూడి-----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీమూల్లేశ్వర స్వామి
నాలుగవ------పాతకోట--------శ్రీ లోపాముద్రా సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
పూర్వాభాద్ర
మొదటి--------ముక్తేశ్వరం-----శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ ముక్తేశ్వర స్వామి
రెండవ---------శాసనపల్లి లంక----శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశ్రీ చౌడేశ్వర స్వామి
మూడవ--------తానెలంక-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ వీరేశ్వరస్వామి
మీన రాశి
మీనరాశికి సంబంధించిన ఆలయం ద్రాక్షారామానికి దక్షిణం ఉన్నది. కుందలమ్మ చెరువులోని శ్రీ పార్వతీ సమేత మార్కండేయ స్వామికి అంకితం చేయబడ్డది ఈఆలయం.
పూర్వాభాద్ర
నాలుగవ---------ఎర్రపోతవరం------శ్రీ పార్వతీ సమేత శ్రీ మల్లికార్జున స్వామి
ఉత్తరాభాద్ర
మొదటి-------డంగేరు-----------శ్రీ పార్వతీ సమేత శ్రీ సోమేశ్వర స్వామి
రెండవ------- కుడుపూరు------- శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ నీలకంఠేశ్వర స్వామి
మూడవ------గుడిగళ్ళ---------శ్రీ ఉమాదేవీ సమేత శ్రీ మార్కండేయ స్వామి
నాలుగవ-----శివల-----------శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత శ్రీ త్రిపురాంతక స్వామి
రేవతి
మొదటి----భట్లపాలిక-------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
రెండవ-----కాపులపాలెం----శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి
మూడవ---- పేకేరు-----------శ్రీ లోపాముద్ర సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి
నాలుగవ---- బాలాంత్రం------శ్రీ రాజరాజేశ్వరీ సమేత శ్రీ అగస్తేశ్వర స్వామి

 

Surya Bagavan's Deeksha


శ్రీ సూర్య భగవానుని దీక్ష ......

ఈ జగత్తును రక్షించి, కాపాడి సర్వ జీవులను పోషించే శక్తిని ఆరోగ్యాన్ని ఇచ్చేదీ ప్రత్యక్ష దైవం సూర్యుడు. ప్రతీ జీవికి నిద్ర లేచింది మొదలు సూర్యుని కిరణాలు ప్రసరించకపోతే జీవితమే ఉండదు. అటువంటి ప్రత్యక్ష దైవం సూర్య భగవానుని అనుగ్రహానికి సూర్య దీక్ష చాలా అవసరం. లోకంలో అనేక దీక్షలు, వ్రతాలు ఉన్నాయి. కానీ ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, పాడి పంటలను,శ్రీ మహాలక్ష్మి అమ్మ వారి కటాక్షములను,శాంతి సౌఖ్యములను ఇచ్చే ఏకైక దీక్ష సూర్యదీక్ష మాత్రమే. సర్వ దేవి దేవతలను పూజిస్తే వచ్చే ఫలం ఒక్క సూర్య దీక్ష వలన మాత్రమే వస్తుంది. అటువంటి ఈ దీక్షను కుల బేధం లేకుండా అందరూ చేయవచ్చు. ఈ కాలానికి సూర్య దీక్ష అందరూ పాటించవలసిన అవసరం ఎంతో ఉంది. మనిషి ఆరోగ్యం కన్నా భాగ్యం ఏమి ఉంది ?

శ్రీ సూర్య దీక్ష ఎందుకు పాటించాలి :
శ్రీ సూర్య భగవానుని దీక్ష చేయటం అంటే అన్నీ మంత్రాలకు, సర్వ దేవతలకు మూలమైన శ్రీ గాయత్రి ఉపాసన చేయడమే అని మనం గుర్తుంచుకోవాలి. పూర్వమూ నిత్యమూ మూడు కాలాలలో సంధ్యావందనం , అంటే సూర్య దీక్ష చేసేవారు. శ్రీ రాముని విశ్వామిత్రుల వారు "కౌసల్యా, సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే " అని, శ్రీ వేంకటేశ్వర స్వామి సుప్రభాత సేవలో శ్రీ సూర్య భగవానుని ప్రార్థించడంతోనే మొదలు అవుతుంది. అంటే సోర్ర్య భగవానుని ఆరాధించకుండా ఎటువంటి దేవుని ప్రార్థించినా సత్ఫలితాన్ని ఇవ్వదని మనకు తెలుస్తోంది. ఆరోగ్యం ఇచ్చేదీ సూర్య భగవానుడు అని మన వేదాలు, పురాణాలు చెప్తున్నై. ఆరోగ్యంగా ఉంది ఎటువంటి రోగాలు లేకుండా జీవించాలని మనిషి కోరుకుంటాడు. సూర్య భగవానుని దీక్ష చేసి అనేక మంది రోగాలను పోగొట్టుకుని,స్వామి వారి కృపతో సంపూర్ణ ఆరోగ్యం, పొందటం, పురాణాల నుండి ఇప్పటికీ మనం చూస్తున్నాం. అందుచేత సూర్యదీక్ష వలన ఆరోగ్యం, ఐశ్వర్యం, పాడి పంటలు, శాంతి సౌఖ్యాలు, లక్ష్మి కటాక్షం, సిరి సంపదలు, ధన ధాన్యాలు లభిస్తాయి.

శ్రీ సూర్య దీక్ష వలన ఉపయోగాలు : పాశ్చ్యాత్యులు ఈ రోజున సన్ గెజింగ్ అని ఉదయించే సూర్యుని కొద్ది సేపు చూడటం వలన కంటికి, సూర్య కిరణాలు తాకడం వలన శరీరానికి ఎంతో ఉపకారమని, దాని వలన సూర్య మండలంలోని కొన్ని శక్తులు మన శరీరాన్ని తాకీ ఎంతో మేలును, హాయిని ఇస్తాయని, చెప్తున్నారు. కానీ మనం ఈ విధానం ఆదిత్య హృదయం ద్వారా మన పూర్వీకులు పెద్దలు మనకు ఏనాడో చెప్పారు. అందుచేత శ్రీ సూర్య దీక్ష అందరమూ చేసి ఆరోగ్యవంతులు కావాలి. సూర్య దీక్ష వలన ఆరోగ్యమే కాకుండా సర్వ భాగ్యాలు వస్తాయి.

ఆదివారం చేయకూడనివి : శాస్త్రాలు వద్దని చెప్పిన
స్త్రీ సంపర్కం, తైల మర్ధనం సూర్యుని ఎదురుగా పళ్ళు తోముకోవడం, మాల మూత్ర విసర్జన, త్రాగుడు, మాంసము, కానీ ఈ రోజు కలి ప్రభావం వలన పై పనులన్నీ ఆదివారం నాడు చేస్తున్నారు. దాని వలన వింత రోగాల బారిన పడి, సూర్య ప్రదక్షిణ మానేసి, ఆసుపత్రి చుట్టూ ప్రదక్షిణ, వారికి దక్షిణ ఇచ్చి, ఇల్లు, ఒళ్ళు, గుల్ల చేసుకుంటున్నాం. అందువలనే ఈ అనార్ధాలు...

ఆదివారం చేయవలసినవి : రోజు, కనీసం ఆదివారం నాడు అయినా సూర్యుని కన్నా ముందే కాల కృత్యాలు తీర్చుకుని సూర్యుని ఎదురుగా ఆర్ఘ్యం, సూర్య నమస్కారం వీలైతే ఆదిత్య హృదయం చదువుకోవటం చేయటం ఎంతో మంచిది. ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని ఎదుట ఎల్లప్పుడూ మనం వినయంగా, భయ భక్తులతో ఉండటం ఎంతో అవసరం. నమస్కారం చేస్తేనే ఎంతో సంతోషిస్తారు స్వామి.

శ్రీ సూర్య దీక్ష ఎలా చేయాలి ? : ప్రతీ రోజు సూర్యుడు ఉదయించకముందే అంటే ఉదయం 5 నుండి 6 లోపున సూర్యునికి ఆర్ఘ్యం అంటే మన రెండు చేతులతో దోసెడు నీళ్ళు తీస్కుని" ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమహ" అని నీళ్లను సూర్యుని చూస్తూ విడిచి పెట్టాలి. కొద్దిసేపు సూర్యునికి నమస్కారం చేసుకుని, పూజ గదిలో స్వామి వారి మూర్తికి దీపారాధన చేయటం ముఖ్యం, నమస్కారం చేస్తే చాలు సర్వ సౌఖ్యాలు ఇస్తాడు. అటువంటిది మనం ఇంకా శ్రద్ధగా సూర్య దీక్ష చేస్తే మనకు వచ్చే ఫలితం ఎంతో ఉంటుంది.

తూర్పు తిరిగి దణ్ణం పెట్టు అని సరదాగా అంటాం. ఏదో విధంగా మనలను సూర్యునికి నమస్కారం చేయమని ఎంతో ఉపకారం అని మన పెద్దలు చెప్తున్నారు. ఇక సూర్య దీక్షలో కెంపు రంగు బట్టలను ధరించాలి. సర్వ దేవతల స్వరూపమైన సూర్య భగవానుని ప్రీతి అయిన ఎర్ర చందనంతో చేసిన స్పటిక లాకెట్ పై సూర్యుని ముద్రా ఉండాలి. నుదిట భస్మ ధారణ చేసి తరువాత ఎర్ర చందనం తిలక ధారణ చేయాలి. ఎర్రని పూలతో పూజ, అందువలన అనారోగ్యం ఉండదు.

దీక్షలో ప్రతీ ఆదివారం స్వామి వారికి ఆవుపాలతో చేయబడిన పాయశాన్ని నివేదెన చేసి ఆదిత్య హృదయం చదువుకోవాలి. ఈ దీక్షకు ముఖ్యంగా ఆహార నియమాలు తప్పనిసరి. నూనె పదార్ధములు తీసుకోరాదు . మితాహారం మంచిది. బయటి ఆహారం ముట్టరాదు .

సూర్య దీక్ష చివరి రోజున తల్లి గాని, భార్య గాని, దీక్ష చేసిన వారైనా గాని, ఒక తెల్లని వస్త్రంలో బియ్యం ( 1 1/4 కేజీ ) ఆవునెయ్యి (పావు కేజీ ) బెల్లం ( అర కేజీ ) పాయసన్నం సంబంధీచి వస్తువులు, శ్రీ ఉషా,పద్మిని అమ్మ వారలకు రెండు రవికెలు , పసుపు, కుంకుమ, తెల్ల వస్త్రంలో కట్టి , తలపై పెట్టి, శ్రీ హనుమత్ క్షేత్రం నందు మన కోసం శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ సూర్య భగవానునికి వారికి ఈ ముడుపు మూటను అందజేసి స్వామి వారి ప్రసాదం స్వీకరించాలి. తరువాత దీక్ష విరమణ చేసుకోవాలి దీని వలన స్వామి వారికి కృపాకు పాత్రులవుదాం....

27 నక్షత్రములు, 12 రాశులు, 9 గ్రహాలకు అధిపతి అయిన సూర్యుని దీక్ష వలన అన్నీ రాశుల వారికి గ్రహ శాంతి కలుగుతుంది. శని యొక్క పీడ ఉండదు. కార్తీక, ధనుర్మాసం, మాఘం, ఎంతో విశేషమైనది. ముఖ్యంగా అయ్యప్ప స్వామి దీక్షతో పాటు సూర్య దీక్ష చేయటం ఎంతో ఫలితం. హనుమంతుడి గురువు అయిన శ్రీ సూర్య దీక్ష వలన శత్రుభయం తొలగి అన్నింటా విజయం . శ్రీ క్షేత్రం లో మహా గణపతిని కూడి సూర్యుడు ఉండటం వలన విగ్నములు ఉండవు. ఈ సూర్య దీక్ష ఎక్కడ పాటించినా, చిక్కవరం గ్రామంలో వెలసిన హనుమత్ క్షేత్రంలో శ్రీ ఉషా పద్మిని, సమేత శ్రీ సూర్య భగవానుని సన్నిధిలో సూర్య దీక్ష విరమణ పొంది, సూర్యుని అనుగ్రహ ఆశీస్సులు పొందండి.

"ఓం శ్రీ ఉషా పద్మిని సమేత శ్రీ శ్రీ శ్రీ సూర్య నారాయణ స్వామినే నమహ '

శ్రీ సూర్య భాగానుని దీక్ష సమయం : కర్కాటక సంక్రమణ , నుండి జనవరి వరకు ఎపుడైనా చేయవచ్చు. స్త్రీలు 21 లేదా 27 రోజులు, పురుషులు 27 లేదా 41 మండలరోజులు చేయడం ఉత్తమం...