Sunday 1 March 2015

నామకరణం పేర్లు.. పెట్టాల్సినవి..పెల్టకూడనివి

నక్షత్రాల పేర్లని శిశువులకు పెట్టకూడదనేది మొదటి నిషేధం. నక్షత్రాలు 27 ఉంటే ఆ అన్నిటికీ చంద్రుడొక్కడే భర్త అయిన కారణంగానూ, నక్షత్రనామాన్ని శిశువుకి పెడితే ఆ స్త్రీ శిశువుకి సవతి దోషం పట్టవచ్చుననే భయంతో నక్షత్రనామాన్ని పెద్దలు 
-నదుల పేర్లు పెట్టకూడదనేది రెండో నిషేధం. నదులెన్ని ఉన్నా వాటన్నింటికీ సముద్రుడే భర్త. అందుకే నదుల పేరు అమ్మాయిలకు పెడితే సవతి దోషం ఉండొచ్చని నిషేధించారు. 
-తీగల పేర్లు, చెట్ల పేర్లు కూడా పెట్టకూడదనేది మూడో నిషేధం. చెట్లు చెట్లు రాసుకుని నిప్పు పుట్టి అడవులు కాలిపోతుంటాయి, చెట్లను నరుకుతారు, గాలికి పడిపోతాయి, చీడ పడుతుంది, ఎండకీ వానకీ దిక్కూమొక్కూ లేకుండా ఒంటరిగా ఉంటాయి కాబట్టి అలాంటి కష్టాలు చందన, కేతకి, మల్లిక, మాలతి లాంటి పేర్లను పెట్టొదంటారు. 
-లకారం ఓ అక్షరంతో కలిసిన అక్షరాలున్న (క్ర-క్ల..) పేరుని కూడా పెట్టరాదన్నారు పెద్దలు. ర బదులు ల పలకితే అర్థంలో భేదం రావడమే కాక, ఒక్కో సందర్భంలో అపార్థం కూడా కలగొచ్చు. ఆమ్రమనే పదానికి మామిడి పండు అనే అర్థం. దాన్ని ఆమ్ల అని పలికితే ఉసిరి అనే అర్థాన్నిస్తుంది.