Monday 23 April 2018

remedy for some one is seriously ill

ఎవరైనా ఆసుపత్రి లో కాని తీవ్రమైన అనారోగ్యం తో బాధపడుతూ ఉంటె ఈక్రింది రేమేడి చేయండి ఫలితము ఉంటుంది.
రోగి జాతక చక్రం ఒక పేపర్ మీద వేయండి. తరువాత బ్రహ్మ స్థానం లో ( సెంటర్) ముట్టుకుంటూ ఓం అనండి
ఇప్పుడు ప్రతి రాశి ని మీ చేతితో ముట్టుకుంటూ ఈ క్రింది బీజ అక్షరాలు చదవండి. మేషం తో మొదలుకొని మీనా వరకు చేయాలి. జాతకుని లగ్నం తో పని లేదు.
మేషం – హమ్
వృషభం- హాం
మిథునం--- హిం
కర్కం --- హీం
సింహం --- హుం
కన్య ---- హూం
తుల --- హెం
వృశ్చిక --- హేo
ధను --- హోం
మకర --- హౌo
కుంభ ---- హమ్
మీనా --- హః
ఇప్పుడు శివలింగం కానీ ఫోటో గాని టచ్ చేయాలి. తరువాత కింది మంత్రం చదవండి
హంసాహై అమృతవర్చెస్ స్వాహా ( haMsaH amritavarchase svaahaa) 
తరువాత ఒక నీటి బిందువును జాతక చక్ర బ్రహ్మ స్థానం లో వుంచండి
తరువాత ఈ కిందిమంత్రం ని 1008 సార్లు జపించండి
ఓం జుమ్ సహవాం వేద వ్యాస య నమః సహజూమ్ ఓం
(om jum sah vaaaM veda-vyaasaaya namaH sah joom OM)
మనస్పూర్తిగా ప్రార్ధన చేయండి ఫలితం వుంటుంది

Pancha devatha Aradhana

పంచదేవత ఆరాధన
శంకరాచార్యులు ప్రవచించిన పంచ దేవత ఆరాధనం లో ప్రతిదినము గృహస్థుడు 5 దేవత రూపములను పూజించాలి.
ఈపంచ దేవతలు మనలో 5 తత్వాలను, 5 క్రింది చక్రాలను శక్తివంతంగా చేస్తాయి. ఈ దేవతలు
1. గణేశ
2. సూర్య లేదా కార్తికేయ
3. విష్ణు లేదా విష్ణు అవతారములలో ఒకటి
4. శివ
5. అమ్మవారు
ఈదేవతలను మీ జాతక చక్రం నుండి గుర్తించి పూజించిన యెడల చాల మంచిది
1. ఇష్ట దేవత:- మీ జాతకంలో రాశి చక్రం లో అత్యదిక డిగ్రీవున్న గ్రహం మీ ఆత్మ కారకుడు అవుతాడు. రాహు కీ అత్యల్పం గా డిగ్రీ వుంటుంది. ఆత్మ కారకుడు అంటే మీ జీవాత్మ ఈగ్రహం లో ప్రస్పుటిస్తుంది. ఇప్పుడుమీరుమీ నవంశ లో
మీ ఆత్మ కారకుడిని గుర్తించండి. అక్కడినుండి 12 వ ఇంట వున్న గ్రహం కానీ, ఆ ఇంటి అధిపతి కానీ మీ ఇష్ట దైవం. 
ఈ పూజ వలన మనశాంతి కలుగుతుంది.
2. ధర్మ దేవత:- నవంశలో ఆత్మకరాకుడి నుండి 9 వ గ్రహం కాని, ఆఇంటి అధిపతికానీ మీ ధర్మ దేవత. ఈ పూజ వలన మీరు ధర్మమార్గంలో నడుస్తారు
3. పాలనాదేవత.:- నవంశ లో అమాత్య కారకుడు( రాశిచక్రంలో రెండవ అతి పెద్ద డిగ్రీ కల గ్రహం) నుండి 6 వ గ్రహం కానీ ఆ ఇంటిఅధిపతి కాని మీ పాలనాదేవత. సాధారణంగా ఈ రూపం అమ్మవారిది గా వుండాలి. ఈ పూజ వలన మనకుఅన్నానికి లోటుఉండదు.
4. భ్రాత్రి కారకుడు:- మీ రాశి చక్రం లో 3 వ అతిపెద్ద డిగ్రీ వున్న గ్రహం. ఈ గ్రహం మీకు గురువును చూపిస్తుంది. నవంశ లో వున్నస్థానము బట్టి గురు రూపం తెలుసుకోవాలి
పైన చెప్పిన దేవతలను పంచదేవతల రూపం లోఆరాధిస్తే శుభం కలుగుతుంది

mantra shastra


మంత్ర శాస్త్రం

కొన్ని మంత్రాలూ రక రకాలు  పదములు కలిగి ఉంటాయీ. మంత్రం చివర ఉన్నపదములవలన మంత్రంఉద్దేశ్యం తెలుసుకోవాచు

  1. నమః ----  ఇది వందనం, నమస్కారం అని చెప్పవచు
  2. స్వాహ--- ఇది దేవతలకు ఆహుతులు ఇచేప్పుడు  చదువుతారు
  3. స్వాదా---ఇది పిత్రు దేవతల కార్యక్రమాలలో వాడతారు
  4. వషట్ --- ఇది ఏదైనా శక్తి ని లోబరచుకోవడానికి వాడతారు
  5. హమ్ --- ఇది ఒక రక్షణ కవచం అని చెప్పవచ్చు
  6. వౌషట్ --- ఇది ఇతరులను లొంగ దీసుకోడానికి   వాడతారు
  7. ఫట్--- ఇది బాణం వంటిది. ఏదైనా పని మీద గురి పెట్టి సాదించడానికి వాడతారు
    కొన్ని మంత్రాల చివర హమ్ ఫట్ అని ఉంటుంది, దీనిలో ఒక గమ్యం ఫై గురిపెడుతూ మానని మనం రక్షించుకోవడానికివాడతారు
    మంత్రాలూ చివర ఫట్, వషట్  వంటివి  ప్రస్తుత కాలానికి అంత సరిపడవు

Ramayana reading a remedy


మనము తరచుగా పెద్దవారు చెబుతుంటే వింటాం రామాయణం  చదివితే కష్టాలు తొలగుతాయి అని.

బృహత్ధర్మ పురాణం మనకు రామాయణం లో వివిధ కాండాలు చదివితే ఏమవుతుందో తెలియచేస్తుంది

1 . బాల కాండ – కరువు, ఆరోగ్య సమస్యలు, నొప్పులు, గ్రహ పీడలు  తోలుగుతాయి

2. అయోధ్య కాండ—పుత్రా సంతానం, వివాహం మరియు గురు దర్శనం

3. అరణ్య కాండ—అగ్ని ప్రమాదాలు, విదేశాలలో కష్టాలు, జల ప్రమాదాలు, న్యాయసంబంధ కష్టాలు, అడవిలో కష్టాలు తోలుగుతాయి

4. కిష్కింద కాండ—మంచి మిత్రులసాంగత్యము, ఇతరులనుండిసహాయం, పోగొట్టుకున్న వస్తువులు, వ్యక్తులు దొరుకుతారు.

5. సుందర కాండ---పిత్రు ఋణం  తీర్చినపుణ్యం లభిస్తుంది, కష్ట నివారణ   , శత్రువు ఫై విజయం

6. యుద్ద\లంకా కాండ--  శత్రువు ఫై విజయం, అపనిందల నుండి బయటపడతారు

7. ఉత్తర కాండ—జీవితం లో కొత్త అధ్యాయం , సౌక్యం, విజయం.