విష్ణుగంధం దేవికి సమర్పిస్తే వ్యాధులు నయమవుతాయట!
విష్ణుగంధాన్ని అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఉపయోగిస్తారు. దీనిలో శ్రీ గంధం, అగిలు గంధం బావంచ, కుంకుష్ట కుంకుమ పూవు, మూరామాంసి, జటామాంసి, శిలారసం వీటిని మూల విగ్రహానికి పెటటి అనంతరం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాద రూపంలో పంచుతారు.

దీన్నంతా ఒకే ప్రమాణంలో గంధం తీసి ఆ గంధాన్ని స్వామికి లేదా దేవికి అర్పించి స్వీకరిస్తే అటువంటి వారికి దేహంలో ఉండే సమస్త వ్యాధులు తొలగి దేవుని అనుగ్రహంతో అన్ని పనులు సత్వరమే సిద్ధిస్తాయి.
దీన్నే లేపన గంధమని అష్టగంధమని, గంధాక్షత అనికూడా పిలుస్తారు. ధీన్ని ధరిస్తే ఆకర్షణతో పాటు తేజోవంతులు, దైవానుగ్రహ సంభూతులు, కీర్తి వంతులు అవుతారు. దీన్ని ఏ దేవాలయంలో అయితే ఉపయోగిస్తారో ఆ దేవునికి, దేవతా కళ ఎక్కువ అవుతుంది. ఈ గంధాన్ని స్త్రీలు కూడా ధరించవచ్చునని పండితులు చెబుతున్నారు.
No comments:
Post a Comment