Thursday, 26 February 2015

శని దోష నివారణకు ఏం చేయాలి

శని దోష నివారణకు ఏం చేయాలి
మనలో చాలామంది కళ్యాణ దోషం, కాలసర్ప దోషం, దుష్టమానవుల దృష్టి దోషాలు, వాస్తుదోషాలు, నవగ్రహ దోషాలు ఇలా అనేక రకాల దోషాలతో బాధపడుతుంటారు.
గ్రహల్లో శని ప్రభావం చాలా ఎక్కువ, శని దోషం ఉన్నవారు సుఖశాంతులు లేకుండా బాధపడుతుంటారు. శని దోషం వల్ల ఏవో కష్టనష్టాలు పట్టి పీడిస్తుంటాయి. శని దోషం నుండి బయట పడేందుకు దేవాలయాల్లో అర్చకులు ఉపశాంతి చేస్తుంటారు. నవగ్రహారాధన, ప్రత్యేకంగా శని గ్రహారాధన సూచిస్తుంటారు. శని గ్రహ పూజలతో పాటు, శని ధ్యానం చేసినా దోష నివారణ అవుతుంది. శనిధ్యానం శ్లోకాలు ఆరు. ఈ శ్లోకాలను మనసారా స్మరించుకోవాలి.
సూర్యపుత్రో దీర్ఘదేహః
విశాలక్ష శ్శివప్రియ:
మందచార: ప్రసన్నాత్మా
పీడాం దహతు మే శని:
శన్యారిష్టే తు సంప్రాప్తే
శనిపూజాంచ కారయేత్
శనిధ్యానం ప్రవక్ష్యామి
ప్రాణి పీడోపశాంతయే
నీలాంజన సమాభాసం
రవిపుత్రం యమాగ్రజం
చాయా మార్తాండ సంభూతం
తన్నమామి శనైశ్చరం
నమస్తే కోణ సంస్థాయ
పింగళాయ నమోస్తుతే
నమస్తే బభ్రు రూపాయ
కృష్ణాయచ నమోస్తుతే
మనస్తే రౌద్ర దేహాయ
నమస్తే చాంతకాయచ
నమస్తే యమ సంజ్ఞాయ
నమస్తే సౌరాయే విభో
నమస్తే మంద సంజ్ఞాయ
శనైశ్చర నమోస్తు
ప్రసాదం మమదేవేశ
దీనస్య ప్ర్రణతస్యచ.
ఓం, ఐం, హ్రీం, శ్రీం శనైశ్చరాయనమః
ఈ శని ధ్యాన శ్లోకాలను 19 వేలసార్లు పఠించినట్లయితే ఎలాంటి శని దోషాలైనా నివారణ అవుతాయి.
భక్తి శ్రధలతో 28 సార్లు పఠించినా శనిదోష నివారణ మవుతుంది

వివిధ అభిషేకాలు – వాటి పలితాలు

వివిధ అభిషేకాలు – వాటి పలితాలు
ఒక్కొక్క వస్తువుతో చేసే అభిషేకానికి ఒక్కొక్క ఫలితం ఉంటుంది. వివిధ అభిషేకాలు, వాటివలన కలిగే ఫలితాలు ఇవీ.
1. ఆవుపాలు అభిషేకంతో సర్వసుఖాలను పొందవచ్చును. 
2. ఆవు పెరుగుతో చేసే అభిషేకం వలన ఆరోగ్య మును, బలమును పొందవచ్చును. 3.ఆవునునెయ్యితో అభిషేకం వలన ఐశ్వర్యాభివృద్ది కలుగుతుంది.
4.పంచదారతో అభిషేకం చేస్తే సర్వ ధు:ఖ నాశనము జరుగుతుంది.
5.తేనెతో అభిషేకం చేస్తే వంశవృద్ది కలుగుతుంది.
6.పుష్పజలంతో అభిషేకం చేస్తే సిరిసంపదలు కలుగుతాయి.
7. పసుపుతో అభిషేకం చేస్తే మంగళకరం
8. కుంకుమజలంతో అభిషేకం చేస్తే చక్రవర్తిత్వం కలుగుతుంది.
9. భస్మజలంతో చేస్తే పాపాలన్నీ నశించిపోతాయి.
10. నువ్వులనూనె తో చేస్తే అపమృత్యుభయం తొలగి పోతుంది.
11. గంథజలంతో అభిషేకం చేస్తే పుత్రసంతానం కలుగుతుంది.
12. దూర్వజలంతో అభిషేకం చేస్తే పోయిన సొమ్ము తిరిగి లభిస్తుంది.
13. రుధ్రాక్షజలంతో అభిషేకిస్తే మహదైశ్వర్యము లభించును
14. సువర్ణజలంతో అభిషేకిస్తే దారిద్ర్యం నశించి పోతుంది.
15.రుద్రాక్షరసంతో అభిషేకిస్తే సర్వకార్యసిద్ధి కలుగుతోంది.
16. కస్తూరిజలంతో అభిషేకిస్తే సర్వాధికారం లభిస్తుంది.
17.నవరత్నజలంతో అభిషేకిస్తే ధన, ధాన్య, గృహప్రాప్తి కలుగుతుంది.
18.మామిడిరసంతో అభిషేకిస్తే దీర్ఘవ్యాధులన్నీ నివారణమౌతాయి.
19. విభూదితో అభిషేకిస్తే అష్టైశ్వర్యాలు మోక్షం కలుగు

ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి!

ఆహారం తినే ముందు దైవానికి నివేదన చేయాలి!
కాళ్ళు కడుక్కోకుండా ఇంట్లోకి రాకూడదు.
కాలకృత్యముల తరువాత స్నానం చేయకుండా వంట చేయకూడదు.
మలవిసర్జన, మూత్రవిసర్జన తరువాత కాళ్ళు చేతులు ముఖం శుబ్రంగా కడుక్కొని, ఓం నారాయణాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం మాధవాయ నమః అంటూ తలపై 3సార్లు నీళ్ళు చల్లుకొని ఇంట్లోకి రావాలి.
దైవానికి నివేదన చేయకుండా ఆహారం తీసుకోకూడదు.
నిలబడి భోజనం చేయకూడదు. వంటి మీద చొక్కా వేసుకుని భోజనం చేయకూడదు.
భుజం మీద తువాలు లేకుండా ఆహారం తీసుకోకూడదు. పూజ చేయకూడదు. కనీసం జేబు రుమాలు అయినా భుజం మీద వేసుకుని చేయాలి.
ఎవరైనా ఇంటికి వస్తే కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వాలి. లేదా పంపులు ఉంటాయి కదా కనీసం చూపించండి. కడుక్కొని లోపలికి వస్తారు. రాగానే నీళ్ళు తాగుతారా అని పొరపాటున కూడా అడగకూడదు. రాగానే మంచి నీళ్ళు తీసుకెళ్ళి ఇవ్వాలి.
భోజన సమయానికి ఎవరైనా అతిధి వస్తే భోజనం పెట్టాలి. అంతేకాని ఎంగిలి చేతితో మీరే గుమ్మం దగ్గరికి వెళ్లి ఎక్కడ లోపలికి వస్తాడేమో అని అక్కడే మాట్లాడి పంపకూడదు.
మనసులో ఒకమాట పైకి ఒకమాట మాట్లాడకూడదు. (భోజనం చేస్తారా అని పైకి మాట్లాడి, లోపల! భోజనాల సమయానికి వచ్చి చచ్చాడు. ఇలా మాట్లాడకూడదు.) ఏది మనసులో వుందో అదే మాట్లాడాలి.
నిత్య దీపారాధన చేయాలి. ఇలాంటి ఇల్లు లక్ష్మితో కళకళలాడుతుంది.
మూత్ర విసర్జన నిలబడి చేయకూడదు. ముత్ర విసర్జన తరువాత కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి రావాలి.
త్రిసంధ్యలలో నిద్రించకూడదు. ఆహారం తీసుకోకూడదు. ప్రయాణం చేయకూడదు. (ఉదయం 5:00 నుండి 5:45, మధ్యాహ్నం 12 నుండి 12:45, సాయంత్రం 5 నుండి :5:45 వరకు త్రిసంధ్యలు అంటారు)
ఉదయించే సూర్యుడిని దంత ధావనం (పళ్ళు తోమడం) చేయకుండా, చేస్తూ చూడకూడదు.(సూర్యోదయం కాకముందే లేచి దంతధావనం చేయాలి అని అర్ధం) తూర్పు పడమర నిలబడి పళ్ళు దంతధావనం చేయకూడదు.
తిట్టుకుంటూ, ఏదో ఆలోచనలు చేస్తూ వంట చేయకూడదు. మీరు చేసే ఆలోచనలు అన్ని ఆభోజనంలోకి చేరి ఇంట్లో వారిపై ప్రభావం చూపిస్తాయి.
తలపై చేతులు పెట్టకూడదు. తలపై మునివేళ్ళతో గోకకుడదు. రుద్దకూడదు. దీనివలన పతనావస్తకి చేరుకుంటారు.
ఎడమ చేతితో పొరబాటున కూడా తినకూడదు, త్రాగ కూడదు.

శని మహాదశ వదిలించుకోవటానికి కొన్ని పరిష్కార మార్గాలు

శని మహాదశ వదిలించుకోవటానికి కొన్ని పరిష్కార మార్గాలు
వేద జ్యోతిషశాస్త్రం ప్రకారం, శని అత్యంత మండే గ్రహం. సౌర వ్యవస్థలో శని అతి నిదానంగా కదిలే గ్రహం. ఈ కారణంగా, ఇది చల్లగా, బీడు,పొడిగా, సీక్రెటివ్ గ్రహంగా ఉంటుంది. దాని ప్రభావం ఎక్కువ తీవ్రత మరియు ఎక్కువ కాలం ఉంటుంది.
శని గ్రహం శుక్రుడు ఆధీనంలో జన్మించిన ప్రజలకు అనుకూలము అని చెబుతారు. మరోవైపు, శని, బుధుడు ఆధీనంలో జన్మించిన ప్రజలకు మంచిది కాదు. జ్యోతిషశాస్త్రం శనిని పాముగా వర్ణిస్తుంది. దీని తల రాహు మరియు తోక కేతు అని చెప్పుతారు. కేతు శనిని ఇంటి ముందు ఉంచితే, అప్పుడు అది ఆ వ్యక్తికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
అందువలన, శని స్థానం ఒక వ్యక్తిని అత్యంత విజయవంతముగా చేయవచ్చు. అలాగే పూర్తిగా పతనం చేయవచ్చు. శనిమహా దశ 19 సంవత్సరాల కాలం మొండిగా మరియు కష్టంగా ఉంటుంది. శని వలన కఠినమైన క్రమశిక్షణ, జాప్యాలు సృష్టించడం, ఇబ్బందులను కల్గించటం, వ్యక్తి మీద బాధ్యతలు వంటివి జరుగుతాయి.
* శనిమహాదశ వదిలించుకోవటానికి పరిష్కారాలు
* రుద్రాభిషేకం
రుద్రాభిషేకం చేయుట లేదా సోమవారం మరియు శనివారం శివలింగం మీద నీరు పోయడం చేయాలి. ఇది శనిమహాదశ కోసం ఒక సమర్థవంతమైన పరిష్కారం అని చెప్పవచ్చు.
* హనుమంతుడుని ప్రార్ధించటం
మంగళవారం మరియు శనివారం హనుమంతుడుని ప్రార్ధిస్తే శని శాంతింపజేయడంలో సహాయపడుతుంది. ప్రతి రోజు హనుమంతుని చాలీసా పఠిస్తూ ఉంటే, శని ఉధృతి తగ్గటానికి సహాయపడుతుంది.
* నల్ల నువ్వుల సీడ్స్
లార్డ్ శనిని పూజిస్తూ ఆస్వాదించుట మరియు శివుడికి సమర్పించటానికి ప్రార్ధనలు చేయాలి. ప్రతి రోజు శివలింగం మీద నల్ల నువ్వులతో కలిపిన పచ్చి పాలను పోయాలి. ప్రత్యేకంగా శనివారం రోజు చేస్తే శని చెడు ప్రభావాలను శాంతింపజేయడంలో సహాయపడుతుంది
* నల్ల మినుములు దానం చేయుట
నల్ల మినుమలను పేదవారికి దానం చేయుట మరియు ఒక ప్రవహించే నదిలో కొన్ని వదలాలి.
* ఆవాల నూనె
ఒక గిన్నెలో ఆవాల నూనెను పోసి మీ నీడను చూసి మరియు శని కృప కోసం దానిని శనివారం దానం చేయాలి.
* ఉపవాసం
సాడ్ సతి ప్రభావంతో వచ్చిన ప్రజలు, శని దయ, మహా దశ లేదా అంతర్-దశ ఉన్నవారు శనివారం ఉపవాసం ఉండాలి. శనివారం ఉపవాసం చేస్తే ఆర్థరైటిస్, వీపునొప్పి మరియు కండరాల రుగ్మత వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఈ ఉపవాసం ఒక వ్యక్తికి సానుకూలత మరియు మానసిక ఒత్తిడి నుండి ఉపశమనం కలిగిస్తుంది.
* ఆయిల్
ప్రతి శనివారం, పడుకునే ముందు శరీరం మరియు గోర్లకు నూనెను వర్తించండి. ఎటువంటి మందులు లేదా వ్యసనాత్మక విషయాలను ఉపయోగించడం మానుకోండి.
* నలుపు ధరించాలి
నలుపు శని దేవునికి ఇష్టమైన రంగు. కాబట్టి, శనివారాలలో నలుపు ధరిస్తే, మీకు శని గ్రహం నుండి ఇబ్బందులు తగ్గుతాయి.
* శని మంత్రం
"నీలాంజన సమాభాసం రవి పుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నమామి శనైశ్చరం" . శనివారం వీలైనన్ని సార్లు ఈ మంత్రాన్ని స్మరించుకోవాలి. మీరు ఈ మంత్రాన్ని కనీసం 108 సార్లు పఠించాలి

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ శ్లోకాన్ని పఠించండి!

పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ శ్లోకాన్ని పఠించండి!
పిల్లల్లో జ్ఞాపకశక్తి పెరగాలంటే..
ఓం నమో భగవతే దక్షిణా మూర్తయే మహ్యం మేథాం ప్రజ్ఞాం ప్రయచ్ఛ స్వాహా ||
అనే మంత్రాన్ని గురువారం పూట శ్రద్ధతో పఠించే వారికి లేదా ప్రతిరోజూ నిష్ఠతో పై మంత్రంతో గురు భగవానుడిని ధ్యానించే వారికి జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
అలాగే పరీక్షల్లో మంచి మార్కులు కొట్టేయాలంటే ప్రయత్నంతో పాటు గురు భగవానుడికి సంబంధించిన పై శ్లోకాన్ని చదవాలి. ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 11 సార్లు ఈ శ్లోకాన్ని పఠిస్తే జ్ఞాపకశక్తి పెరుగుతుంది.
పిల్లలే కాదు.. పెద్దలు కూడా దక్షిణామూర్తికి సంబంధించిన పై మంత్రాన్ని రోజూ పఠిస్తే.. జ్ఞాపకశక్తి పెరుగుతుందని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

గాయత్రీ స్నానమంటే ఏమిటో తెలుసా?

గాయత్రీ స్నానమంటే ఏమిటో తెలుసా?
గాయత్రీ స్నానమంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. గాయత్రీ మంత్రంతో కనీసం పదిసార్లైనా అభిమంత్రించిన జలముతో శిరస్సును అవయవాలను శుభ్రం చేసుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి.
భగవద్ధ్యానము, విష్ణుచింతనము, వేదాంత శ్రవణము, సద్గ్రంథపఠనము, ఇటువంటివన్నీ ధ్యానమయస్నానాల్లో చేరుతాయి.
నారాయణుడిని స్మరించి అతని పాదములలో పుట్టిన ఆకాశగంగ తల తలపైన పడి తన బ్రహ్మరంధ్రం గుండా శరీరం లోపలికి ప్రవేశించుచున్నట్లు భావించాలి.
ఇటువంటి పవిత్రభావన వల్ల బాహ్యాభ్యంతర పరిశుద్ధుడై స్పటికముల వలె నిర్మలులై ఉంటారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమ!

 పువ్వులకంటే ఆకు పూజతో ప్రసన్నుడయ్యే హనుమ!
హనుమంతుడు పూలతో కూడిన పూజతో కంటే ఆకు పూజకే అధిక ప్రాధాన్య ఇస్తాడని పండితులు అంటున్నారు. హనుమంతుడికి ఆకుపూజ చేస్తే అనేక గండాలు, ఆర్థిక ఇబ్బందులు, ఈతిబాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక నిపుణులు అంటున్నారు.
హనుమంతుడు ఆకుపూజకు ఇష్టపడటం ఎందుకంటే.. హనుమంతుడు లంకానగారానికి వెళ్లి సీతమ్మవారి జాడను తెలుసుకుంటాడు. ఆమెకి ధైర్యం చెప్పి .. శ్రీరాముడి సైన్యం పట్ల లంకానగర వాసులకు భయం కలిగేలా చేస్తాడు. ఆ తరువాత అక్కడి నుంచి తిరిగి వచ్చి రాముడిని కలుసుకుని .. సీతను చూసిన విషయం చెబుతాడు.
సంతోషించిన శ్రీరాముడు అక్కడ గల తమలపాకులను తెంపి మాలగా చేసి ఆయన మేడలో వేసి అభినందిస్తాడు. శుభవార్తను తెచ్చినవారికి తమ దగ్గర గల ఖరీదైన వస్తువును బహూకరించడం అప్పట్లో ఒక సంప్రదాయంగా ఉండేది. రాముడు వనవాసంలో ఉన్నాడు ... ఇక హనుమంతుడు లంకా నగరంలోని కొన్ని భవనాలను తగలబెట్టి మరీ వచ్చాడు. అందువలన ఆయన శరీరం వేడిగా ఉండటంతో, తాపాన్ని తగ్గించడం కోసం రాముడు ఆయన మెడలో తమలపాకుల మాలను వేసినట్టు పురాణాలు చెబుతున్నాయి.
ఆ తమలపాకుల మాల మెడలో పడగానే అప్పటివరకూ హనుమంతుడు పడిన శ్రమనంతా మరిచి సంతోషంతో పొంగిపోయాడు. అందుకే తమలపాకులతో పూజ చేస్తే కోరుకున్న వరాలను హనుమంతుడు ప్రసాదిస్తాడని పురోహితులు చెబుతున్నారు.

విష్ణుగంధం దేవికి సమర్పిస్తే వ్యాధులు నయమవుతాయట!

విష్ణుగంధం దేవికి సమర్పిస్తే వ్యాధులు నయమవుతాయట!
విష్ణుగంధాన్ని అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఉపయోగిస్తారు. దీనిలో శ్రీ గంధం, అగిలు గంధం బావంచ, కుంకుష్ట కుంకుమ పూవు, మూరామాంసి, జటామాంసి, శిలారసం వీటిని మూల విగ్రహానికి పెటటి అనంతరం పూజా కార్యక్రమాలు ముగిసిన తర్వాత భక్తులకు ప్రసాద రూపంలో పంచుతారు.
దీన్నంతా ఒకే ప్రమాణంలో గంధం తీసి ఆ గంధాన్ని స్వామికి లేదా దేవికి అర్పించి స్వీకరిస్తే అటువంటి వారికి దేహంలో ఉండే సమస్త వ్యాధులు తొలగి దేవుని అనుగ్రహంతో అన్ని పనులు సత్వరమే సిద్ధిస్తాయి.
దీన్నే లేపన గంధమని అష్టగంధమని, గంధాక్షత అనికూడా పిలుస్తారు. ధీన్ని ధరిస్తే ఆకర్షణతో పాటు తేజోవంతులు, దైవానుగ్రహ సంభూతులు, కీర్తి వంతులు అవుతారు. దీన్ని ఏ దేవాలయంలో అయితే ఉపయోగిస్తారో ఆ దేవునికి, దేవతా కళ ఎక్కువ అవుతుంది. ఈ గంధాన్ని స్త్రీలు కూడా ధరించవచ్చునని పండితులు చెబుతున్నారు.

సింధూర ధారణతో దాంపత్య సమస్యలు తొలగిపోతాయట!

సింధూర ధారణతో దాంపత్య సమస్యలు తొలగిపోతాయట!
సింధూరాన్ని హనుమంతునికి పూస్తారు. ఆ సింధూరాన్ని ప్రతిరోజూ నుదుటన ధరించే వారికి అన్ని రకాల దాంపత్య సమస్యలు తొలగిపోకాయని పురోహితులు చెబుతున్నారు. ఎవరింట్లో నిత్యం కలహాలు జరుగుతుంటాయో అటువంటి వారు రోజూ సింధూర ధారణ చేయాలి. అలాగే ప్రతి విషయానికి భయంతో వణికిపోతుండే వారికి సింధూరం పెడితే భయం తొలగిపోతుంది.
భార్య భర్తలు, పిల్లల మధ్య సఖ్యత లేని వారు సింధూరాన్ని పెట్టుకుంటే సుఖం, సంతోషం, ప్రశాంతత లభిస్తుంది. చిన్నపిల్లలకు బాలగ్రహ దోషాలు ఉంటే ఆ పిల్లలకు సింధూరాన్ని పెడితే భయం, రోగ బాధలు దరిచేరవు. ఇంకా ఆరోగ్యవంతులుగా ఉంటారు.
విద్యార్థులు ఆంజనేయస్వామి గుడికి వెళ్లి అంగారాన్ని పెట్టుకుంటే పరీక్ష సమయంలో చదివిన విషయాలన్నింటినీ మరిచిపోకుండా ఉంటారు. లో బీపీ, రక్త హీనతతో బాధపడేవారు ఆంజనేయస్వామి తీర్థాన్ని సేవించి సింధూరాన్ని నుదుటికి పెట్టుకుంటే ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. గ్రహ బాధలు ఉన్నవారు ప్రతిరోజూ సింధూరాన్ని పెట్టుకుంటే గ్రహాల బాధ తొలగిపోతుంది.
ఇంట్లో ఆంజనేయ స్వామికి గంధాన్ని పూయదలచినవారు దేవుని చిత్రాన్ని దక్షిణం వైపు ఉంచి కొద్దిగా గంధాన్ని స్వామి కిరీటానికి పెట్టాలి. తర్వాత స్వామి వారి ప్రతిమ గంధం పూసుకుంటూ వచ్చి చివరిగా గంధాన్ని పాదం వద్ద పెట్టి పూజిస్తే తలచిన కార్యాలు నెరవేరుతాయి. ఆంజనేయ స్వామికి సింధూరాన్ని పెట్టి తర్వాత దానిని పాలల్లో లేదా నీటిలో కలిపి తాగుతూ ఉంటే దేహం వజ్రకాయమవుతుందని పండితులు చెబుతున్నారు.

శమీ పత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే..!?

శమీ పత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే..!?
శమీపత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే అన్ని రకాల గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆయా నవగ్రహాలకు ప్రీతికరమైన రోజున శమీ పత్రంతో పూజలు, అర్చనలు చేయిస్తే, గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ముఖ్యంగా శనివారం పూట శనిగ్రహానికి శమీ పత్రంలో పూజలు చేస్తే ఏలినాటి శనిదోషం, అష్టమశని దోషాల ప్రభావంతో కలిగే చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇంకా శమీపత్రంతో గణపతిని పూజిస్తే అన్ని రకాల శనైశ్చరుల ఏడున్నర సంవత్సరాల వేధింపు, పంచమ, అష్టమ తదితర దోషాలు నివారించబడతాయి. అలాగే శమీ పత్రంతో శ్రీ లక్ష్మీ నారాయణ దేవుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది
శమీ పత్రంతో దుర్గాదేవికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరుడిని శమీపత్రంతో పూజిస్తే నరాలకు సంబంధించిన వ్యాధులు త్వరగా తొలగిపోతాయి.
ఇంకా శ్రీ చక్రానికి భిన్న పత్రం లేదా శమీ పత్రంతో పూజ చేస్తే జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.