శమీ పత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే..!?
శమీపత్రంతో నవగ్రహ దేవతలను పూజిస్తే అన్ని రకాల గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. ఆయా నవగ్రహాలకు ప్రీతికరమైన రోజున శమీ పత్రంతో పూజలు, అర్చనలు చేయిస్తే, గ్రహ సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది.
ముఖ్యంగా శనివారం పూట శనిగ్రహానికి శమీ పత్రంలో పూజలు చేస్తే ఏలినాటి శనిదోషం, అష్టమశని దోషాల ప్రభావంతో కలిగే చెడు ఫలితాల నుంచి ఉపశమనం లభిస్తుందని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు.
ఇంకా శమీపత్రంతో గణపతిని పూజిస్తే అన్ని రకాల శనైశ్చరుల ఏడున్నర సంవత్సరాల వేధింపు, పంచమ, అష్టమ తదితర దోషాలు నివారించబడతాయి. అలాగే శమీ పత్రంతో శ్రీ లక్ష్మీ నారాయణ దేవుడిని పూజిస్తే జీవితంలో ప్రశాంతత లభిస్తుంది
శమీ పత్రంతో దుర్గాదేవికి పూజ చేస్తే అన్ని పాపాలు తొలగిపోతాయి. ఈశ్వరుడిని శమీపత్రంతో పూజిస్తే నరాలకు సంబంధించిన వ్యాధులు త్వరగా తొలగిపోతాయి.
ఇంకా శ్రీ చక్రానికి భిన్న పత్రం లేదా శమీ పత్రంతో పూజ చేస్తే జన్మజన్మల నుంచి వెంటాడుతున్న పాపాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
No comments:
Post a Comment