Thursday 26 February 2015

గాయత్రీ స్నానమంటే ఏమిటో తెలుసా?

గాయత్రీ స్నానమంటే ఏమిటో తెలుసా?
గాయత్రీ స్నానమంటే ఏమిటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవండి. గాయత్రీ మంత్రంతో కనీసం పదిసార్లైనా అభిమంత్రించిన జలముతో శిరస్సును అవయవాలను శుభ్రం చేసుకుంటే గాయత్రీ స్నానమవుతుంది. దీనివల్ల సమస్త పాపాలు తొలగిపోతాయి.
భగవద్ధ్యానము, విష్ణుచింతనము, వేదాంత శ్రవణము, సద్గ్రంథపఠనము, ఇటువంటివన్నీ ధ్యానమయస్నానాల్లో చేరుతాయి.
నారాయణుడిని స్మరించి అతని పాదములలో పుట్టిన ఆకాశగంగ తల తలపైన పడి తన బ్రహ్మరంధ్రం గుండా శరీరం లోపలికి ప్రవేశించుచున్నట్లు భావించాలి.
ఇటువంటి పవిత్రభావన వల్ల బాహ్యాభ్యంతర పరిశుద్ధుడై స్పటికముల వలె నిర్మలులై ఉంటారని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు.

No comments:

Post a Comment