Monday, 10 August 2015

Feng Shui tips

ఫెంగ్‌షుయ్ సూచించే 10 సూత్రాలను ఫాలో చేస్తే ఆరోగ్యమే కాకుండా..  సంతోషం కూడా సొంతం అవుతుందని ఆ శాస్త్ర నిపుణులు అంటున్నారు. 

అవేంటో.. చూద్దాం.. 
1. పనికి రానివి ఏరేయండి. క్లీన్ హౌజ్ టు బి లక్కీ హోజ్ అనేది ఫెంగ్ షుయ్‌లో మొదటిది. కాబట్టి ఇంట్లో ఉన్న పనికి రాని, అనవసర వస్తువులను తీసేయండి.

2. ఇంట్లో ఏవైనా పగిలిన వస్తువులున్నా, అతికించినా ప్రయోజనం ఉండదని అనిపించిన వస్తువులను బయట పారేయండి. 

3. వెలుతురు ధారాళంగా వచ్చేలా చూసుకోండి. కాంతి ఎక్కువగా ప్రసరిస్తే ఉత్సాహం ఎక్కువగా ప్రసరిస్తే ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. 

4. వస్తువులకు పదునైన మూలలు ఉంటే నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. ఒకవేళ పదునైన మూల మిమ్మల్ని గురిపెట్టినట్లుగా ఉన్నట్లైతే ఆ నెగటివ్ ఎనర్జీ నేరుగా మీకు చేరుతుంది. 

5. డ్రైనేజీ వ్యవస్థ సక్రమంగా ఉండేలా చూసుకోండి. డ్రైనేజీ నీరు బయట పారిన చోట చెడు శక్తులు ఉంటాయి. 

6. ఇంటికి బయట వైపు వేసే రంగులు మూడు రంగుల కన్నా ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. 

7. ఇంట్లో పనిచేసుకునే సమయంలో ద్వారం వైపు ముఖం చేసి కూర్చోండి. రిలాక్స్‌గా, కంఫర్టబుల్‌గా ఫీలవుతారు. 

8. పడకగదిలో టీవీ, కంప్యూటర్ ఉన్నట్లైతే వాటిని హాల్‌లోకి మార్చండి. 

9. పడకగది దగ్గరగా బాత్ రూమ్ ఉన్నట్లైతే డోర్‌ను ఎప్పుడూ క్లోజ్ చేసి పెట్టండి. 

10. ఎప్పుడూ పాజిటివ్ ఆలోచనలు మైండ్‌లో ఉండేలా చూసుకోండి. 


No comments:

Post a Comment