Saturday, 8 August 2015

Raasis and diseases

రాశులు అనారోగ్యం - జాగ్రత్తలు
సాధారణంగా అనారోగ్యాలు పన్నెండు రాశులవారికి వేరువేరుగా ఉంటాయి. అవి రాకముందే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించి ప్రయోజనం పొందవచ్చు. అసలు జ్యోతిష్య శాస్త్ర రీత్యా ఏయే రాశులవారికి ఎలాంటి అనారోగ్యాలు సూచించబడుతున్నాయి, వారు ఎలాంటి ఆహార నియమాలు పాటించాలి, ఎలాంటి మందులు వాడి చక్కని ఫలితాలు పొందవచ్చు అనే విషయాలు తెలుసుకుందాం...
మేషం...
సాధారణంగా ఈ రాశివారికి తల, ఉదరం, పైత్యం, నత్తి, మూత్రపిండాలు, అగ్ని ద్వారా ఇబ్బందులు, కురుపులు (వ్రణాలు), చర్మా నికి సంబంధించిన విచిత్ర వ్యాధులు కలిగే అవకాశం ఉన్నది. అంతేకాకుండా... అండవ్యాధులు, ఉష్ణంతో కూడిన కఫం, రక్తసంబంధ వ్యాధులు హెచ్చు.
జాగ్రత్తలు: 1) ధ్యానం చేస్తూ ఉండాలి. 2) చల్లదనాన్ని ఇచ్చే పూలు (పూల సువాసన). 3) పసుపు, తేనె పరగడపున తీసుకోవాలి. 4) ఆహారంలో కందిపప్పు ఎక్కువగా ఉండాలి.
వృషభం...
గొంతు, హృదయం, మూలసంబంధ వ్యాధులు, అపస్మారక సంబంధ వ్యాధులు, కఫం, ట్రాన్సిల్స్‌, ఢిప్తీరియా, పయో రియా (పళ్ళకు సంబంధించిన వ్యాధి) వచ్చే అవకాశం ఎక్కు వ. గుహ్యావయవాలు, నాభి ప్రదేశాలను ఆరోగ్యవంతంగా ఉంచు కోవాలి. మూత్ర వ్యాధులు, రక్తహీ నత, ఉబ్బసం వంటివి కూడా కలుగవచ్చు.
జాగ్రత్తలు: 1) ధ్యానం (మెడిటేషన్‌). 2) వ్యాయామం. 3) నేట్రం సల్ఫ్‌ (హోమి యో మందు) వాడటం మంచిది.
మిథునం...
విశ్రాంతి లేకపోవడం, ఊపిరితిత్తుల వ్యాధులు, మనోవ్యాధి, ప్రాణవాయువు (ఆక్సిజన్‌ లేకపోవుట), మూలవ్యాధి, న్యుమోనియా, క్షయ, ఫ్లూ, అండవ్యాధులు, మానసిక రోగాలు, చెవుడు, తలనొప్పి, ఉన్మాదం (పిచ్చి) మొదలైన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నది.
జాగ్రత్తలు: 1) పౌష్టికాహారం తీసుకోవడం. 2) గాలి, వెలుతురు ఉన్న గృహ నివాసం. 3) క్రీడలు, వ్యాయామం తప్పనిసరి. 4) కాలీమూరు (హోమియోపతి మందు) వాడాలి.
అంతేకాకుండా ఆరోగ్యాన్ని ప్రసాదించే మొలకెత్తిన పెసలు తినడం చాలా మంచిది.
కర్కాటకం...
రొమ్ము, జీర్ణకోశం, హృదయనాళాల సంబంధిత వ్యాధులు, నీరుపట్టడం, కఫం, కేన్సర్‌, హిస్టీరియా, కీళ్ళనొప్పులు, శోష, గొంతులో బాధ, మానసిక శారీరక బలహీనతలు, కంటికి సంబంధించిన అనారోగ్యాలు, అజీర్ణం, వరిబీజం వంటివి వచ్చే అవకాశం ఉన్నది.
జాగ్రత్తలు: 1) ఎక్కువ ఆలోచనలు మానాలి. 2) యోగాసనాలు చెయ్యాలి. 3) తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అనే అనుమానాలు విడనాడితే మంచిది. 4) మెడి టేషన్‌ చేయాలి. 5) కార్క్‌ఫ్లోర్‌ (హోమియో మందు) మంచిది.
సింహం...
వీపు, వెన్నెముక, హృదయం సంబంధించిన వ్యాధులు, హృదయ దేర్భల్యం, గుండెదడ, నడుము నొప్పి, పండ్ల నొప్పి, ముఖవ్యాధి మొదలనవి సంభవించవచ్చు.
జాగ్రత్తలు: 1) తమ మనసులోని భావాలు బహిరంగపరచడం. 2) సూర్యనమస్కారాలు, ప్రాణాయామం. 3) తమ పనులు తామే నిర్వహించడం. 4) మెగ్ఫాస్‌ (హోమియో మందు) వాడడం మంచిది.
కన్య...
పొట్ట, నాభి ప్రదేశం, వెన్నెము కింది భాగాలకు అనారోగ్యం, అజీర్ణం, విరేచ నాలు, అతిసారం, జీర్ణకోశ వ్యాధులు కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు: 1) సమయానికి మితాహారం తీసుకోవడం. 2) వ్యాయామం, మొలకెత్తిన పెసలు. 3) ఆహారంలో కొవ్వు పదార్థాలు తగ్గింపు. 4) ఆత్మవిశ్వాసం పెంచుకోవడం. 5) కాలీసల్ఫ్‌ వాడడం వంటివి చేయాలి.
తుల...
ఆందోళన, మూత్రపిండాలకు సంబంధించిన వ్యాధులు, మధుమేహం, మూత్ర సమస్యలు, శోష, కీళ్ళవాతం, పైత్యం, శిరోవ్యాధులు, మలబద్ధకం, రక్తహీనత కలిగే అవకాశాలు ఎక్కువ.
జాగ్రత్తలు: 1) బొబ్బర్లు ఆహారంలో ఎక్కువగా తీసుకోవాలి. 2) యోగా, వ్యాయామం తప్పనిసరి. 3) అందరూ మీరు చెప్పినట్టే వినాలి అనే ధోరణి వదిలేయండి.
వృశ్చికం...
తొడలకు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు, చర్మ, సుఖవ్యాధులు, భగందరం, హృద్రోగాలు, కఫం మొదలగు వ్యాధులు కలగవచ్చు.
జాగ్రత్తలు: 1) కందిపప్పు, పసుపు ఆహారంలో వాడాలి. 2) ఈ రాశివారికి చల్లని వాతావరణం మంచిది. 3) ఇతరులను తప్పుపట్టడం మాని... ప్రేమానురాగాలను పెంపొందించుకుంటూ... తప్పుచేయనివారు లోకంలో ఉండరని గుర్తించి సర్దుకోవడం మంచిది.
5) కార్క్‌సల్ఫ్‌ అనే హోమియో మందు వాడితే మంచిది.
ధనుస్సు:
ప్రమాదాలకు గురికావడం, తొడలు, పిరుదులు, నరములు వీటికి సంబంధించిన అనారోగ్యములు, గాయాలు, రక్తదోషము అనారోగ్యము, చర్మవ్యాధులు, స్థూల శరీరం వలన కలిగే ఇబ్బందులు, ఊపిరితిత్తుల సమస్యలు, మధుమేహం.. మొదలైనవి కలిగే అవకాశం వుంది.
జాగ్రత్తలు:
1. వ్యాయామం, ప్రాణాయామం
2. తగిన మోతాదులో ఆహరం
3. మొలకలొచ్చిన శనిగలు, అపక్వాహారం
4. ఎక్కువ బాధ్యతలు తలపైనే వేసుకోకుండా మానసిక ప్రశాంతి కోసం రెండుసార్లు ధ్యానం చేయటం మంచిది.
5. ‘సైలీషియా’ మంచి ఫలితాన్నిస్తుంది (హోమియో)
మకరం:
అజీర్ణం, రక్తదోషాలు, కీళ్ళనొప్పులు, చర్మవ్యాధులు, జలుబు, ఉన్నదరోగాలు, వాతసంబంధ అనారోగ్యాలు, మలమూత్ర వ్యాధులు, చలి, చెవుడు, వెన్నెముక వ్యాధి, కెన్సెర్‌, పక్షవాతం మొదలైనవి వానికి అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. వంటికి నువ్వుల నూనె పట్టించుకోవటం
2. నువ్వుపొడి ఆహారంలో వాడకం
3. ప్రాణయామం, సూర్య నమస్కారాలు
4. అపక్వాహారం తీసుకోవట
5. ‘కాల్కేషాసు వాడకం మంచిది (హోమియో)
కుంభం:
నంజువ్యాధి, కంటి జబ్బు, నరాల జబ్బు, రక్తప్రసారదోషాలు, గుండెజబ్బు, బెణుకు నొప్పులు, కాళ్ళు, సీల మండల వ్యాధులు, అంటువ్యాధులు, జలోదరం, మలేరియా, నిద్రలేమి, రక్తపోటు మొదలైన అనారోగ్యాలకు అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మకరరాశి వలె వీరు కూడా నువ్వుల నూనె మసాజ్‌, ఆహారంలో నువ్వులపొడి వాడటం, సూర్య నమస్కారాలు చెయ్యటం చేయాలి.
2. నేత్రం మూరు వాడడం మంచిది
3. ప్రతిపనిలోను చురుకుదనం అలవర్చుకోవడం ద్వారా శరీరానికి అవసరమైన శక్తిని సమకూర్చుకోగలరు.
మీనం:
భాహాద్రేకం, బలహీనత, కీళ్ళజబ్బులు, పాదములు, కాలివేళ్ళు నీరు పట్టడం, మద్యపానాదుల వల్ల వచ్చే అనారోగ్యం, కణతులు, మలకోశం, ఆమకోశం మొదలైన వానికి సంబంధించిన అనారోగ్యాలు కలిగే అవకాశం ఉంది.
జాగ్రత్తలు:
1. మొలకలు వచ్చిన శనిగలు, మితహారం
2. పసుపు ఆహారంలో తీకుకోవటం
3. కవితా రచన భావోద్రేకాలను అదుపు చేస్తుంది
4. ఫెర్రంపాసు (హోమియో) వీరికి తగినది.

No comments:

Post a Comment